Friday, November 22, 2024

Tamilanadu – ఎన్నిక‌ల‌కు ముందే సెల్వంకు షాక్! మాజీ సిఎం కు కొత్త క‌ష్టాలు

తమిళ‌నాడు రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్‌సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన రామనాథపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. సాధారణంగా ఏదైనా నియోజకవర్గంలో ముఖ్య నేతలు పోటీచేస్తే వారి పేరుతో పలువురు బరిలో నిలవడం మామూలే. ఒకే ఇంటిపేరు మొదటి అక్షరంతో ఉండటం అరుదు. రామనాథపురంలో ఓ.పన్నీర్‌సెల్వం పేరిట నలుగురు బరిలోకి దిగడం ఓపీఎస్‌ వర్గాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇంత‌మంది సెల్వంలా?

మదురై జిల్లా ఉక్కిలార్పట్టికి చెందిన ఒచ్చప్పన్‌ కుమారుడు పన్నీర్‌సెల్వం, రామనాథపురం జిల్లా కాట్టూర్‌కి చెందిన ఒయ్యారం తనయుడు పన్నీర్‌సెల్వం, మదురై తిరుమంగళానికి చెందిన ఒచ్చాందేవర్‌ కొడుకు పన్నీర్‌సెల్వం, మదురై సోలై అళగుపురానికి చెందిన ఒయ్యాందేవర్‌ కుమారుడు పన్నీర్‌సెల్వం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల పరిశీలనలో అందరి నామపత్రాలు ఆమోదించినట్లు ప్రకటించారు. అక్షరక్రమంలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వం పేర్లు పక్కపక్కనే వస్తాయని, తమ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని ఓపీఎస్‌ మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement