రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తిరుపూర్ జిల్లాలోని మతుకళం సమీపంలో టూరిస్ట్ వ్యాన్, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ కుటుంబం తమ బంధువుల ఇంట్లో సంతాప కార్యక్రమం కోసం పళని వెళ్లారు.
కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో వీరి కారును టూరిస్ట్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో టూరిస్ట్ వ్యాన్‌లో ఉన్న 20మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మడతుకులం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.