హిందూ మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లి పట్టుబడిన భారత జాలర్లను బ్రిటన్ అధికారులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. సెప్టెంబర్ 29న తమిళనాడుకు చెందిన 36 మంది జాలర్లు చేపల వేట కోసం వెళ్లి బ్రిటీష్ ఇండియన్ ఓషియన్ టెర్రిటరీలోకి ప్రవేశించారు.
దీంతో అక్కడ గస్తీకాస్తున్న బ్రిటన్ నేవీ వారిని అదుపులోకి తీసుకుంది. తమ జాలర్లను బ్రిటన్ బంధించిన సమాచారం తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం.. బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఆ జాలర్లను బ్రిటన్ అధికారులు విడిచిపెట్టారు. వారిని కేరళలలోని ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు అప్పగించారు. దీంతో 36మంది మత్స్యకారులు రాష్ట్రానికి చేరుకున్నారు.