Sunday, November 24, 2024

Tamil Nadu: కల్తీ సారా ఘటనపై .. అసెంబ్లీలో గందరగోళం

తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కల్తీ సారా ఘటనపై అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. డీఎంకే ఆధ్వర్యంలోనే సారా విక్రయిస్తున్నారని ఆరోపణలు చేశాయి. మృతులకు అసెంబ్లీలో సంతాప తీర్మానం చేశారు. కాగా అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. మరోవైపు కల్తీ సారాపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది.

సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్, డీజీపీ హాజరయ్యారు. ఇప్పటికే ఈ కల్తీ సారా ఘటనలో 35 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 95 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement