తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పరిశీలించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి ప్రభుత్వ స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. స్కూళ్లలో సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే మొహల్లా క్లినిక్‌లోని వైద్యులతో స్టాలిన్ మాట్లాడారు. క్లినిక్‌ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఢిల్లీలోని తమ పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లను సందర్శించేందుకు వచ్చారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
తమ స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించడం తాము గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. మరోవైపు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కూడా విద్య, ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించిందని స్టాలిన్ మీడియాతో అన్నారు. తమ రాష్ట్రంలో స్కూళ్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. మోడల్ స్కూళ్ల ప్రారంభోత్సవానికి తమిళనాడు ప్రజల తరుఫున కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..