తమిళ స్టార్ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణం తనను కలచివేసిందని తమిళనాడు సీఎం స్టాలిన్ బావోద్వేగం చెందారు. చెన్నైలోని విరుగంబాక్కంలోని నటుడి నివాసానికి చేరుకున్నఆయన కెప్టెన్ భౌతికకాయంపై పూలు ఉంచి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం ఆయన వయసు 71 ఏళ్లు. కెప్టెన్ మృతివార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. మరోవైపు విజయకాంత్ మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి తరలించారు.