ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతున్నారు. ప్రాంతీయ సినిమాను ఆ స్థాయికి తీసుకెళ్లిన హీరో ప్రభాస్. పాన్ ఇండియా స్థాయి సినిమా ఎలా ఉండాలో ప్రభాస్ సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇక మితంగా మాట్లాడే ఆయనకు ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా ఉంది. సినీరంగానికి చెందిన వారు సైతం ఆయన ఫ్యాన్స్. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు మాదిరిగానే అతిథులను గౌరవిస్తారు. వారికి పసందైన విందుతో ఆతిథ్యమిస్తారు.
ప్రభాస్‌తో నటించిన సహ నటులు అందరూ ఇదే విషయాన్ని పలుసందర్భాల్లో చెబుతుంటారు. ఆ జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరింది. ప్రభాస్‌తో కలిసి రేబల్, బాహుబలి చిత్రాల్లో నటించింది.
తాజాగా తమన్నా ఓ ఇంటర్వూలో ప్రభాస్ ఆతిథ్యం గురించి మాట్లాడింది. ”ప్రభాస్ తన ఇంటికి వచ్చిన అతిథులను ఎలా చూసుకుంటారనేది దాదాపు అందరికీ తెలుసు. ఆయన భోజనానికి పిలిస్తే అందులో 30 రకాల వంటకాలు ఉంటాయి. ప్రభాస్ డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఆయన ఆతిథ్యం నిజంగా ఒక రాజు ఎలా ఉంటాడో ప్రభాస్‌ను చూస్తే తెలుస్తుంది. ఆయన నిజమైన కింగ్. ప్రభాస్ పెద్ద స్టార్ అయినా.. చాలా సింపుల్‌గా ఉంటారని” ప్రశంసలు కురిపించింది.
హైదరాబా ద్లో షూటింగ్ ఉంటే యూనిట్ అందరికీ తన ఇంటి నుండి భోజనం తెప్పిస్తారు ప్రభాస్. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించిన వారిలో అమితాబ్, మురళీశర్మ, శృతిహాసన్, పూజా హెగ్డే, తాజాగా తమన్నా వంటి వారు ఉన్నారు. ప్రభాస్ ఇంటి వంటకాల గురించి వారు కథలు కథలుగా చెబుతుంటారు.
ప్రభాస్ కు తమన్నా ప్రశంసలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement