Friday, November 22, 2024

తాలిపేరు ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత

భద్రాద్రి కొత్తగూడెం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు ఎగువన ఉన్న ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలోని వాగులు, వంకల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో తాలిపేరు ప్రాజెక్టు 12 గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు సామర్థ్యం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 72.5 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 10,813 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 12 గేట్లు ఎత్తి 14,148 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. వరద నీరు పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని తాలిపేరు డీఈఈ తిరుపతి తెలిపారు. వరినాట్ల నిమిత్తం ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Advertisement

తాజా వార్తలు

Advertisement