ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయిన తరువాత తొలిసారి నెల రోజులైంది. మొదటిసారి భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖను రాశారు. అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన తరువాత ఖతర్ టెక్నాలజీని సపోర్ట్‌గా తీసుకొని ఎయిర్‌పోర్ట్‌ను రెడీ చేశామని, ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ప్రయాణాలకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, తమ దేశానికి చెందిన రెండు అధికారిక విమాన సంస్థలైన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్, కామ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలను తిరిగి ప్రారంభించబోతున్నారని, వాణిజ్య విమానా రవాణాకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ తాలిబన్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ఇప్పటి వరకు పాక్ మినహా ఏ దేశం కూడా అధికారికంగా ఆ దేశానికి విమానాలు నడపడం లేదు. దీంతో ఆ దేశం అనేక ఇబ్బందులు పడుతున్నది. అంతర్జాతీయంగా తాలిబన్ల ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ఏ దేశం గుర్తించలేదు.
ఇది కూడా చదవండి: పోసానిపై మెగా కుమార్తె నిహారిక ఫైర్