ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడానికి ఇక ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఆక్రమించారు తాలిబన్లు. నిన్న ఆ నగరానికి అతి సమీపంలోకి వచ్చేసిన ఉగ్రవాదులు.. ఒక్కరోజులోనే నగరం లోపలికి చొచ్చుకొచ్చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నగరం నలుమూలల నుంచి తాలిబన్ ఉగ్రవాదులు చొరబడిపోతున్నారని అన్నారు.నగరంలోని చాలా ప్రాంతాల్లో తుపాకుల మోత మోగుతోందని ఆఫ్ఘన్ అధ్యక్ష భవనం తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో ట్వీట్ చేసింది.
ఇది కూడా చదవండి: భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్‌పై విమర్శలు