ఉజ్వల భవిష్యత్తు దిశగా బలమైన అడుగులు వేస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చిప్స్ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రూ. 1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
- Advertisement -
ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘మనం ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాం. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. చరిత్రను కొత్తగా లిఖిస్తున్నాం. ఉజ్వల భవిష్యత్తు దిశగా బలమైన అడుగులు వేస్తున్నామని ‘ అన్నారు.
కాగా, వాటిలో గుజరాత్‌లోని ధోలేరాలో టాటా, పవర్‌చిప్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీతో పాటు సనంద్‌లో సీజీ పవర్ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీ, అస్సాంలోని మోరిగావ్‌లో అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్ట్ యూనిట్ ఉన్నాయి.