Friday, November 22, 2024

స్పౌజ్ బదిలీలు చేపట్టండి.. మంత్రి సబితకు విజ్ఞప్తి

నిజామాబాద్ (ప్రభ న్యూస్):గత జనవరిలో ప్రభుత్వం కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను మాత్రమే జరిపిందని ఇంకా మిగిలిన 1500 ఎస్ జిటి భాష పండితులు, పీఈటి ల స్పౌజ్ బదిలీలు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డినీ స్పౌజ్ సభ్యులు కోరారు. ఆదివారం హైదరాబాద్ లో ని సబితా ఇంద్ర రెడ్డి నివాసంలో మంత్రిని కలిసి ఎస్ జి టి, పి ఈ టి బాషా పండితులు, మిగిలి పోయిన స్కూల్ అసిస్టెంట్, మిస్సింగ్ స్పౌజ్ బదిలీలను చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో మహిళా ఉపాధ్యాయినీలు కన్నీటి పర్యంతమయ్యారు. సంద ర్భంగా బదిలీలు చేపట్టాలని మందికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు.

గత జనవరిలో ప్రభుత్వం కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను మాత్రమే జరిపిందని ఇంకా మిగిలిన 1500 ఎస్ జి టి భాషపండితులు, పీఈటి ల స్పౌజ్ బదిలీల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరగా జరిపించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహిళా ఉపాధ్యా యినీలు వేడుకున్నారు. ఇందు లో మెజారిటీ బాధితులు మహిళ ఉపాధ్యాయినీలె ఉన్నారనీ వారు ప్రతిరోజు కుటుంబాన్ని వదిలిపెట్టి వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ తీవ్ర శారీరక, మానసిక ఆందో ళనకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు ఆమె సానుకూ లంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement