Wednesday, November 20, 2024

రోడ్ల పనులు చేపట్టండి-అభివృద్ధికి సహకరించండి.. లోక్‌సభలో ఎంపీ డాక్టర్ సత్యవతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని అనకాపల్లి వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రోడ్డు రంగానికి 3 లక్షల కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గారికి కృతజ్ఞతలని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి గారు పేర్కొన్నారు. సోమవారం సత్యవతి పార్లమెంట్‌లో మాట్లాడుతూ కోస్తా ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ పర్యాటకాన్ని పెంచుతుందని,పట్టణ గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అనకాపల్లి-ఆనందపురం 6 లైన్ల రోడ్డును మంత్రివర్గం దాదాపు మూడేళ్ల క్రితమే మంజూరు చేసిందని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా దీనికి సంబంధించి చర్యలు వేగవంతం చేయాలని కోరారు.

ఈ రోడ్డు డిజైన్‌ ప్రకారం హెలిప్యాడ్‌ను నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇవ్వలేదని ఆమె కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దానికితోడు వైజాగ్ నగరానికి సమీప రహదారి అయిన షీలా నగర్, పోర్ట్-రోడ్డుకు ఈ రహదారిని కలుపుతూ ఒక చిన్న బైపాస్ రోడ్డు త్వరగా అవసరమని తెలిపారు. తొట్టాడ జంక్షన్ వద్ద NH-16 హైవేపై రోడ్డు అండర్‌పాస్ కూడా ప్రతిపాదిత ఆరు లేన్ హైవేలో చేర్చారని, ఇది ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతమని వివరించారు. యలమంచిలి సమీపంలోని 16వ నంబర్ జాతీయ రహదారిలో పురుషోత్తమపురం జంక్షన్ వద్ద మరో బ్లాక్ స్పాట్ ఉందని అన్నారు. రహదారి భద్రతను కాపాడేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

3 జిల్లాలను కలిపే వెంకన్నపాలెం-నర్సీపట్నం మీదుగా సబ్బవరం నుంచి తునికి రాష్ట్ర రహదారిని మారిస్తే విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు అవసరమని ఎంపీ సత్యవతి నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిగణించి వాటి సత్వర అమలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె కాంక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement