పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ..ఐరన్ తదితర వ్యర్థాలను తిరుపతికి తరలించాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల బాలాజీ నగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్కింగ్ ప్రాంతాలను ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. డ్రైనేజి, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు తదితర వాటిని పరిశీలించి అక్కడ ఉన్న కాంక్రీట్ వ్యర్థాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు 480 టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు ఇంజినీరింగ్ అధికారులు ఈవోకు వివరించారు. అనంతరం అక్కడి స్థానికులకు టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనులను, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ.2 జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డాక్టర్ శ్రీదేవి, విజివో బాలిరెడ్డి, ఇఇ సురేంద్రరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement