Sunday, November 24, 2024

టేక్ ఇట్ ఈజీ పాలసీ… షిఫ్ట్ టైంకి మించి పనిచేస్తే సిస్టమ్ షట్ డౌన్ అవుతదట !

భారతదేశంలోని ప్రముఖ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి “ఆఫీసుల్లో పనిచేసే ఎక్స్ ట్రా టైం తప్పనిసరిగా ప్రోడక్టివిట్ గా మారే అవసరం లేదు” అని ఒకప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు, ఒక IT స్టార్టప్ దీనిని ప్రేరణగా తీసుకుని.. దానికి తగు పాలసీలను ఏర్పాటు చేసింది. దానికి సంబందించి మధ్యప్రదేశ్ లోని IT కంపెనీ సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్ ఉద్యోగి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఉద్యోగులెవరైనా వర్క్ టైమింగ్స్ కు మించి పనిచేస్తే.. వారు పని చేపే సిస్టమ్ స్క్రీన్ పై “WARNING!!!!! Your shift time is over. The office system will shut down in ten minutes. PLEASE GO HOME!!!” అని ఒక వార్నింగ్ వస్తుంది.

“ఇది ప్రమోషనల్ లేదా ఫేక్ పోస్ట్ కాదు.. ఇదీ మా ఆఫీస్ ‘సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్’ నిజస్వరూపం. ఆఫీస్ టైం అయిపోయిన తరువాత ఉద్యోగులకు ఎక్స్ ట్రా కాల్స్ లేదా మెయిల్స్ రావు.. అద్భుతం కాదా ? కాబట్టి, మీరు కూడా ఈ రకమైన వాతావరణంలో పని చేస్తుంటే, మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి మండే మోటివేషన్ లేదా ఫన్ ఫ్రైడే లాంటివి అవసరం లేదని నేను భావిస్తున్నాను ! ఇదే మా ఆఫీస్ పాలసీ !! అవును, సౌకర్యవంతమైన వర్క్ అవర్స్, సంతోషకరమైన వాతావరణంలో పని చేయడానికి మించింది మరొకటి లేదని మేము భావిస్తున్నాం.” అని IT కంపెనీ HR తన్వి ఖండేల్వాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement