తాజ్‌మహల్ నిర్మించిన స్థలం జైపూర్ పాలకుడు జైసింగ్‌దని బీజేపీ ఎంపీదియా కుమారి స్పష్టం చేశారు. జైపూర్ రాచకుటుంబం వద్ద ఇందుకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని కూడా ఆమె అన్నారు. ఈ స్థలాన్ని మొగల్ చక్రవర్తి షాజహాన్ తీసుకున్నారని ఆమె ఆరోపించారు. తాజ్‌మహల్ చరిత్రపై నిజనిర్ధారణ బృందాలు దర్యాప్తు జరపాలంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు ఆమె మద్దతు పలికారు. ఈ చారిత్రక కట్టడం వెనుక దాగిన రహస్యాలు వెలికితీయడానికి అందులోని 22 గదులను తెరవాలన్న పిటిషనర్ వాదన హేతుబద్ధమైనదేనని ఆమె తెలియజేశారు. తాజ్‌మహల్ కట్టడానికి ముందు అక్కడేమున్నదన్న వాస్తవం ప్రజలకు తెలియాలి. ఇందుకోసం సమగ్ర దర్యాప్తు జరగాలి. జైపూర్ రాచకుటుంబం వద్ద ఈ భూమికి సంబంధించిన రికార్డులున్నాయి.
వాటిని పరిశీలిస్తే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అని ఆమె తెలియజేశారు. జైపూర్ రాజా దగ్గరి నుంచి భూమిని తీసుకున్నందుకు షాజహాన్ పరిహారం చెల్లించినప్పటికీ అది ఎంతమొత్తం అన్నది తనకు తెలియదని ఆమె అన్నారు. పరిహారం మొత్తాన్ని జైపూర్ రాజు తీసుకున్నాడా… అందుకు అంగీకరించాడా… అన్న వివరాలు తెలియాలంటే పోతిఖానాలోని ఈ పత్రాలను పరిశీలించాల్సిందేనని ఆమె వివరించారు. ఈ గదులకు ఎందుకు తాళం వేశారో ప్రజలకు తెలియాలి. తాజమహల్‌కు ముందు అక్కడేదైనా కట్టడం ఉండి ఉండవచ్చు. బహుశ… అక్కడ ఓ గుడి ఉండి ఉంటుంది అని ఆమె అభిప్రాయపడ్డారు. తానింతవరకు రికార్డులను చదవలేదని, చదివిన తరువాత ఒక నిర్ణయానికి రాగలనని దియా కుమారి వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..