Friday, November 22, 2024

మిలటరీ సర్వీస్‌ను పొడిగించిన తైవాన్‌

తైవాన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా సైన్యంలో పని చేయాలనే నిబంధనను మరో ఏడాది పాటు పొడిగించింది. ఇప్పటి వరకు నాలుగు నెలలు ఉన్న తప్పనిసరి తప్పనిసరి మిలటరీ సర్వీస్‌ను అమాంతం ఏడాది కాలానికి పెంచింది. 2024 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. చైనా నుంచి ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో తైవాన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని తైవాన్‌ అధ్యక్షురాలు థ్యాయ్‌ ఇంగ్‌ వెన్‌ మంగళవారం వెల్లడించారు. తైవాన్‌ శాంతిని కోరుకుంటుందని, తమ దేశంపై చైనా దాడిని తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా థ్యాయ్‌ తెలిపారు. ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. కానీ మా పొరుగు దేశం చైనా యుద్ధాన్ని కోరుకుంటోంది. అందుకనే 2024 నుంచి మిలిటరీ సర్వీస్‌ను ఏడాదికి పెంచుతున్నాం. 2005 జనవరి 1 తర్వాత జన్మించిన అందరు మగవాళ్లకు ఈ నిబంధన వర్తిస్తుంది అని ఆమె వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement