ఈకాలం యువత ఆలోచనలు చాలా వినూత్నంగా ఉంటున్నాయి. కొందిరి ఆలోచనలైతే ఊహకు కూడా అందవు. ఏదైనే చేస్తా వెరైటీగా చేయాలి.. కొన్నేళ్లపాటు గుర్తుండిపోవాలి అనే తరహాలో ప్రవరిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి కోవకే చెందుతారు చెన్నైకి చెందిన కాబోయే నూతన జంట. వీరిద్దరు వైద్య రంగానికి చెందిన వారు కావడంతో, తమ శుభలేఖ డిజైన్‌ను ఆ దిశగా ఆలోచించారు. చివరకు ట్యాబ్లెట్ షీట్ వెనుకవైపు నమూనాలో వెడ్డింగ్ కార్డును డిజైన్ చేసి ఆశ్చర్యపరిచారు. ప్రత్యేకంగా చెబితే తప్ప అదొక వెడ్డింగ్ కార్డు అని గుర్తించడం సాధ్యంకాదు. వధూవరుల పేర్లు, ముహూర్తం, వేదిక, ఇలా అన్ని అంశాలను వినూత్నంగా పొందుపరిచారు.
డ్రగ్ పేరున్న చోట వధూవరుల పేర్లను, డ్రగ్‌లో ఔషధాల వివరాల చోట విద్యార్హతల్ని ముద్రించారు. మ్యానుఫ్రాక్చరర్ బై అన్నచోట ఆహ్వానిస్తున్న తల్లిదండ్రుల పేర్లు రాసివుంచారు. వార్నింగ్ అనే చోట, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు పెళ్లికి మిస్కావొద్దనే సందేశం ఇచ్చారు. భలే వెరైటీగా ఉందంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఈ వధూవరుల పేర్లు ఎళిలరసన్, వసంతకుమారి. సెప్టెంబర్ 5న వీరిద్దరు వివాహంతో ఒక్కటికానున్నారు.