Monday, November 18, 2024

T20world cup: టీమిండియా స్క్వాడ్‌ ఇదే

టీ20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో జట్టును వెల్లడించింది. దీనిలో ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవన్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్‌లకు అనూహ్యంగా టీ20 జట్టులో స్థానం దక్కింది.భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్‌ బుమ్రాను పేసర్లుగా ఎంపిక చేసింది. సెప్టెంబరు 10 కల్లా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల వివరాలను తెలపాలనే ఐసీసీ నిబంధన ప్రకారమే బీసీసీఐ ఈ జట్టును వెల్లడించింది. అయితే అక్టోబరు 10 వరకూ జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఈ జట్టుకు భారత మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

భారత జట్టును చూస్తేనే సెలక్టర్లు స్పిన్ కు పెద్దపీట వేసినట్లు అర్ధం అవుతుంది. ఎందుకంటే యూఏఈ లో ఉన్న పిచ్ లు ఎక్కువ స్పిన్నర్ లకే అనుకూలిస్తాయి. ఆ కారణంగానే అశ్విన్ జట్టులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ జట్టులో ఉంటాం అనుకున్న ధావన్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, పృథ్వీ షా లకు షాక్ తగిలింది అనే చెప్పాలి.

భారత జట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ.

ఇది కూడా చదవండి: గవాస్కర్ టీ20 జట్టు.. ఓపెనర్ గా కోహ్లీ-రోహిత్

Advertisement

తాజా వార్తలు

Advertisement