టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ – సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో… టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుని నెదర్లాండ్స్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
అయితే, గ్రూప్ డి లోని ఈ జట్లు ఇప్పటి వరకు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి రెండేసి పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
జట్ల వివరాలు :
సౌతాఫ్రికా : రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (వికెట్), ఐడెన్ మార్క్రామ్ (సి), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఒట్నీల్ బార్ట్‌మాన్, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబడా, మార్కో జాన్సెన్.
నెదర్లాండ్స్ : మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ’డౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (సి & వికెట్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మా.