టీ20 ప్రపంచకప్లో భాగంగా నేడు జరిగిన మరో మ్యాచ్లో గ్రూప్-బిలోని ఒమన్, స్కాట్లాండ్ జట్లు తలపడగా.. స్కాట్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేయగా.. అనంతరం చేజింగ్కు దిగిన స్కాట్లాండ్ 13.1 ఓవర్లలో మ్యాచ్ను ముగించేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈజీ చేజ్ లో స్కాట్లాండ్ బ్యాటర్ బ్రాండన్ మెక్ముల్లెన్ (31 బంతుల్లో 61 నాటౌట్)తో హాఫ్ సెంచరీతో చెలరేగాడు… ఓపెనన్ జార్జ్ మున్సే (41) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఇక మైఖేల్ అలెగ్జాండర్ జోన్స్ (16), రిచర్డ్ బెరింగ్టన్ (13), మాథ్యూ హెన్రీ (15 నాటౌట్) రాణించారు.
ఇక ఈ విజయంతో గ్రూప్లో ఉన్న స్కాట్లాండ్.. పాయింట్స్ టుబుల్లో ఐదు పాయింట్లతొ అగ్రస్థానానికి చేరుకుంది