టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ ముందు 202 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది. అనంతరం డిఫెండింగ్‌లోనూ సత్తా చాటి ఇంగ్లండ్‌పై 36 పరుగుల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో 34 పరుగులు), డేవిడ్ వార్నర్ (16 బంతుల్లో 39 పరుగులు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 35 పరుగులు), గ్లెన్ మాక్స్వెల్ (25 బంతుల్లో 28 పరుగులు), మార్కస్ స్టోయినిస్ (17 బంతుల్లో 30 పరుగులు), అద్భుతంగా రాణించారు.
అనంతరం చేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిలిప్ సాల్ట్ (23 బంతుల్లో 37 పరుగులు), జోస్ బట్లర్ (28 బంతుల్లో 42 పరుగులు), మొయిన్ అలీ (15 బంతుల్లో 25 పరుగులు), హ్యారీ బ్రూక్ (16 బంతుల్లో 20 పరుగులు నాటౌట్) రాణించినప్పటికీ నిర్ణీత ఓవర్లలో ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించలేకపోయారు. దీంతో 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా తమ రెండో విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్-బిలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.