టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మరో మ్యాచ్లో గ్రూప్ బిలోని ఓమన్ – స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. కాగా, వెస్ట్ ఇండీస్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఓమన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
కాగా, ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా, స్కాట్లాండ్ మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఒమన్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి ఖాతా తెరవాలనే పట్టుదలతో ఒమన్ జట్టు బరిలోకి దిగనుంది.
జట్ల వివరాలు :
స్కాట్లాండ్ : జార్జ్ మున్సే, మైఖేల్ అలెగ్జాండర్ జోన్స్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, రిచర్డ్ బెరింగ్టన్ (సి), మాథ్యూ హెన్రీ క్రాస్ (వికెట్), మైఖేల్ అలెగ్జాండర్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, క్రిస్ సోల్, బ్రాడ్లీ వీల్, సఫ్యాన్ షరీఫ్.
ఒమన్ : నసీమ్ ఖుషీ (వికెట్), ప్రతీక్ అథవాలే, అకిబ్ ఇలియాస్ సులేహ్రీ (సి), జీషన్ మక్సూద్, ఖలీద్ కైల్, అయాన్ ఖాన్, మెహ్రాన్ ఖాన్, రఫీవుల్లా, షకీల్ అహ్మద్, కలీముల్లా, బిలాల్ ఖాన్.