Friday, November 22, 2024

T20WC | ఆదుకున్న క్లాసెన్, మిల్లర్.. బంగ్లా టార్గెట్ ఎంతంటే

టీ20 ప్రపంచకప్ లో2024 మరో లోస్కోరింగ్ మ్యాచ్ నమోదైంది. నేడు న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమైంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఐదు ఓవర్లలో టాపార్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (46), డేవిడ్ మిల్లర్ (29) జట్టును ఆదుకున్నారు. నిలకడగా ఆడుతూ ఐదో వికెట్‌కు 79 పరుగులు చేశాడు. ఇక, ఓపెనర్ క్వింటన్ డి కాక్ (18), హెన్రిచ్ క్లాసెన్ (46), డేవిడ్ మిల్లర్ (29) మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేయగలిగింది.

ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ మూడు, తస్కిన్ అహ్మద్ రెండు, తస్కిన్ అహ్మద్ ఒక్క‌ వికెట్ తీశారు. దీంతో బంగ్లాదేశ్ జ‌ట్టు 114 ప‌రుగులు ల‌క్ష్యంతో చేజింగ్‌కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement