Monday, November 11, 2024

T20WC Finals | ఈసారి వదలొద్దు.. మరికాసేపట్లో భారత్‌ – దక్షిణాఫ్రికా అమీతుమీ

నెల రోజులుగా క్రికెట్‌ అభిమానులను ఆలరిస్తున్న ప్రపంచకప్‌ మహా సంగ్రామం నేటితో ముగియనుంది. ప్రపంచకప్‌ ట్రోఫీ కోసం మొత్తం 20 జట్లు పోటీ పడగా.. అందులో రెండు జట్లు మాత్రమే తుది పోరుకు అర్హత సాధించాయి. మిగతా జట్లు దశలవారిగా ఇంటి బాటపట్టాయి. ఇప్పుడు బార్బడోస్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌ ఫైట్‌కు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు కూడా అజేయంగా తుది పోరుకు చేరుకోవడంతో మ్యాచ్‌పై అందరి ఆసక్తి మరింతగా పెరిగింది. సఫారీ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రవేశించి చరిత్ర సృష్టించగా.. భారత్‌ రెండో ట్రోఫీ కోసం 17 ఏళ్లుగా ఎదురుచూస్తోంది.

బ్రిడ్జ్‌టౌన్‌: టీ20 ప్రపంచకప్‌ -2024 తుది దశకు చేరింది. టోర్నీలో అజేయంగా నిలిచిన రెండు జట్లు భారత్‌, దక్షిణాఫ్రికాలు వరల్డ్‌కప్‌ ట్రోఫీ కోసం ఫైనల్‌ ఫైట్‌ చేయనున్నాయి. దాంతో.. ఎవరు టైటిల్‌ నెగ్గుతారనేది సర్వత్రా ఆకస్తి నెలకొంది. నేడు బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా ఇరుజట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌ను చిత్తు చేసి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టగా.. మరోవైపు సంచలన జట్టు అఫ్గానిస్తాన్‌పై భారీ విజయంతో సఫారీ జట్టు టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. 2007 తొలి సీజన్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత్‌ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించి రెండో ట్రోఫీ సొంతం చేసుకోవాలని చూస్తోంది.

మరోవైపు ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ నెగ్గని సఫారీ జట్టు తొలిసారి ఫైనల్లో ప్రవేశించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమకు లభించిన సువర్ణావకా శాన్ని చేజారనివ్వకుండా తొలి వరల్డ్‌కప్‌ టైటిల్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. దాంతో శనివారం ఇరుజట్ల మధ్య ఫైనల్‌ ఫైట్‌ హోరాహో రీగా జరగడం ఖాయమనిపిస్తోంది. టోర్నీ ఆరంభం నుంచే చిరస్మరణీయ ప్రదర్శనలతో రోహిత్‌ సేన అదరగొట్టింది.

- Advertisement -

మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం తడబడుతూ ఇక్కడి వరకు చేరింది. ఓవరాల్‌గా చూస్తే ఇరుజట్ల లో టీమిండియాకు విజయ అవకాశాలు మెరు గ్గా ఉన్నా యని విశ్లేషకుల అంచనా. కానీ కీలకమైన ఫైనల్లో ఏ జట్టును కూడా తక్కువ అంచన వేయడం పెద్ద పొరపాటే. అందుకే రోహిత్‌ సేన కూడా దానికి తగ్గట్టు మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకొని టైటిల్‌ వార్‌కు రెడీ అయింది.

ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌, అన్ని విభాగాల్లో గొప్పగా రాణిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్‌లో భారత్‌ చాలా పటిష్టంగా ఉంది. బుమ్రా, అర్ష్‌దీప్‌, కుల్దిప్‌, అక్షర్‌ పటేలతో కూడిన బౌలింగ్‌ దళం టీమిండియా విజయాల్లో ముందు వరుసలో ఉంది. కఠిన సమయాల్లోనూ వీరు విజృంభిస్తూ జట్టుకు అండగా నిలిస్తున్నారు. మరోవైపు బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మళ్లి ఫామ్‌ను అందుకోవడం భారత్‌కు పెద్ల ప్లస్‌ పాయింట్‌గా మారింది.

చివరి రెండు మ్యాచుల్లో అతడు విధ్వం సం సృష్టించారు. మరోవైపు సూర్య కుమార్‌, హార్దిక్‌, రిషభ్‌ పంత్‌ కూడా బాధ్యతగా ఆడుతూ బ్యాటింగ్‌ భారాన్ని మొస్తున్నారు. వీరితో పాటు శివం దూబే, అక్షర్‌ పటేల్‌, జడేజాలు కూడా అప్పుడ ప్పుడు బ్యాట్‌ ఝులిపిస్తూ జట్టుకు అండగా నిలిస్తున్నారు. మొత్తంగా టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శ నతో వరల్డ్‌కప్‌ ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది.

ఈసారి కూడా అందరూ కలిసికట్టుగా రాణిస్తూ టీమిండియాకు రెండో ట్రోఫీ దక్కడం ఖాయం. మరోవైపు సఫారీ జట్టు కూడా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కెప్టెన్‌ మార్క్‌రమ్‌తో పాటు డికాక్‌, రీజా హెండ్రిక్స్‌, స్టబ్స్‌, క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌లతో కూడిన ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటింగ్‌ లైనప్‌ దక్షిణాఫ్రికాకు సొంతం. మరోవైపు బౌలిం గ్‌లోనూ రబాడా, నోర్జే, మార్కో జాన్సెన్‌, షంసీ, కేశవ్‌ మహరాజ్‌లతో కూడిన బౌలింగ్‌ దళం.. ఎలాంటి బ్యాటింగ్‌ లైనప్‌నైనా పడగొట్టగలదు. అం దుకే సఫారీ జట్టును తక్కువ అంచనా వేయలేము.

తుది జట్ల వివరాలు (అంచనా):

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దిప్‌, జస్ప్రీత్‌ బుమ్రా.

దక్షిణాఫ్రికా: క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), రీజా హెండ్రిక్స్‌, అయిడెన్‌ మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, మార్కొ జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌/బార్ట్‌మన్‌, కగిసో రబాడా, అన్రిచ్‌ నోర్జే, తబ్రేజ్‌ షంసీ.

ధక్షినాఫ్రికాపై భారత్‌దే పై చేయి..

టీ20ల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌దే ఆధిపత్యం ఉంది. భారత్‌-దక్షిణాఫ్రికాలు ఇప్పటి వరకు 26 టీ20 మ్యాచుల్లో ముఖాముఖీగా తలపడ్డాయి. అందులో టీమిండియా 14 విజయాలు సాధించగా.. దక్షిణాఫ్రికా మాత్రం 11 మ్యాచుల్లోనే నెగ్గింది. ఒక్క మ్యాచ్‌ ఫలితం తేలలేదు. గతేడాది ఇరుజట్లు చివరిసారి తలపడగా అందులో భారత్‌ 106 పరుగుల తేడాతో సఫారీలను చితు చేసింది. ఇక టీ20 వరల్డ్‌కప్‌ సమరాల్లో భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇరుజట్లు ఆరుసార్లు తలపడగా.. భారత్‌ నాలుగింట్లో విజయం సాధించగా.. సఫారీ జట్టు రెండు మ్యాచుల్లో గెలిచింది.

ఈసారైనా ట్రోఫీ ద‌క్కేనా…

టీమిండియాను విజయపతంలో నడిపిస్తున్న భారత సారథి రోహిత్‌ శర్మ 12 నెలల వ్యవధిలోనే వరుసగా మూడోసారి భారత జట్టును ఐసీసీ ప్రపంచకప్‌ ట్రోఫీ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. అయితే తొలి రెండు ప్రయత్నాల్లో మన జట్టుకు ట్రోఫీ అందించడంలో విఫలమైన రోహిత్‌ మూడోసారి మాత్రం భారత్‌ను విశ్వవిజేతగా నిలపాలని అందరూ కోరుకొంటున్నారు. రోహిత్‌ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా ప్రపంచ టెస్టు చాంపియ న్‌షిప్‌ (డబ్ల్యూటీసీ), 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రవేశించింది.

కానీ, ఈ రెండు సార్లు కూడా ఆస్ట్రేలియా చేతిలో రోహిత్‌ సేనకు పరాభవం తప్పలేదు. అయితే ఈసారి సూపర్‌-8లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి రోహిత్‌ ప్రతీకారం తీర్చుకు న్నాడు. ఇక గత టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియాను ఓడించి న ఇంగ్లండ్‌తో ఈసారి రివేంజ్‌ తీసుకున్నాడు. ఇప్పుడు ఫైనల్లో దక్షిణా ఫ్రికాను ఓడించి భారత్‌కు రెండో టీ20 ప్రపంచ కప్‌ ట్రోఫీ అందించాలని ఆతృతగా ఉన్నాడు.

తొమ్మిదో టైటిల్ ఎవ‌రిది….

2007 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇపటి వరకు మొత్తం 8 సార్లు విశ్వసమరాలు జరుగాయి. అందులో భారత్‌ ఒక్కసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది. ఇంగ్లండ్‌ (2010-2022), వెస్టిండీస్‌ (2012- 2016) జట్లు చెరో రెండు సార్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. భారత్‌ (2007)తో పాటు పాకిస్తాన్‌ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) తలోసారి వరల్‌కప్‌ ట్రోఫీలను గెలుచుకున్నాయి. ఇప్పుడు వెస్టిండీస్‌-యూఎస్‌ఏ వేదికలుగా 9వ సీజన్‌ (వరల్డ్‌కప్‌ 2024) పోటీలు జరుగుతున్నా యి. బార్బడోస్‌ వేదికగా జరిగే ఫైనల్లో భారత్‌-దక్షిణాఫ్రికాలు 9వ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement