Tuesday, July 2, 2024

T20WC Final | టీమిండియా ఐదో వికెట్ డౌన్… 19 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్ ఎంతంటే

బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 టైటిల్ పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమ్ ఇండియా బ్యాట‌ర్లు తొలుత కాస్త తడబడ్డా.. నెమ్మదిగా కుదురుకున్నారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ (76) వ‌ద్ద 19వ ఓవ‌ర్ మార్కో జాన్సెన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం క్రీజ్‌లో శివం దూబే (22), హార్దిక్ పాండ్యా (4) ఉన్నారు. ఇక 19ఓవ‌ర్లు ముగిసేస‌రికి 5 వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు సాధించింది టీమిండియా.

*ఇక అంతక నాలుగో వికెట్ గా క్రీజ్‌లోకి వచ్చిన అక్ష‌ర్ ప‌టేట్ (47) సిక్సులతో చెలరేగాడు.

*రిష‌బ్ పంత్ త‌రువాత క్రీజ్ లోకి వ‌చ్చిన సూర్య కుమార్ యాదవ్ (3) ఐదో ఓవ‌ర్లో ర‌బాడా బౌలింగ్ మూడో బంతికి క్యాచ్ అవుట‌య్యాడు.

*ఫ‌స్ట్ ఓవ‌ర్ నుంచే బౌండ‌రీల మోత మోగిస్తున్న టీమిండియా రెండో ఓవ‌ర్ లో తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (9) రెండో ఓవ‌ర్ నాలుగో బంతికి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. కాగా, అదే ఓవర్ ఆఖ‌రి బంతికి అప్పుడే క్రీజ్ లోకి వ‌చ్చిర రిష‌బ్ పంత్ డ‌కౌట్ గా పెవిలియ‌న్ చేరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement