టీ20 ప్రపంచ కప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫైనల్ పోరు ఆరంభమైంది. బార్బడోస్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ ఫైట్‌కు సిద్ధమయ్యాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యటింగ్ ఎంచుకుంది. కాగా, మరికొద్ది సేపట్లో టీమిండియా బరిలోకి దిగనుంది.
ఈ రెండు జట్లు కూడా అజేయంగా తుది పోరుకు చేరుకోవడంతో మ్యాచ్‌పై అందరి ఆసక్తి మరింతగా పెరిగింది. సఫారీ జట్టు తొలిసారి ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశించి చరిత్ర సృష్టించగా.. భారత్ రెండో ట్రోఫీ కోసం 17 ఏళ్లుగా ఎదురుచూస్తోంది.
అయితే, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో అజేయంగా నిలిచిన ఏ జట్టు కూడా టైటిల్‌ను గెలుచుకోలేదు. అయితే ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు చరిత్రను తిరగరాయబోతున్నాయి. ఈ రెండిటిలో ఒక్క జట్టు టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది.
జట్ల వివరాలు :
ఇండియా : రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికె), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (వికెట్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ.