Tuesday, July 2, 2024

T20WC Final | కోహ్లీ హాఫ్ సెంచ‌రీ.. 16 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్ ఎంతంటే

బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 టైటిల్ పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమ్ ఇండియా బ్యాట‌ర్లు తొలుత కాస్త తడబడ్డా.. నెమ్మదిగా కుదురుకున్నారు. ఈ క్రమంలో వికెట్లు ప‌డుతున్న నిలకడగా ఆడుతూ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు విరాట్ కోహ్లీ (50).

దీంతో 16 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి టీమిండియా 134 పరుగులు సాధించింది. ఇక ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (63), శివం దూబే ఉన్నారు (21).

*ఇక అంతక నాలుగో వికెట్ గా క్రీజ్‌లోకి వచ్చిన అక్ష‌ర్ ప‌టేట్ (47) సిక్సులతో చెలరేగాడు.

*రిష‌బ్ పంత్ త‌రువాత క్రీజ్ లోకి వ‌చ్చిన సూర్య కుమార్ యాదవ్ (3) ఐదో ఓవ‌ర్లో ర‌బాడా బౌలింగ్ మూడో బంతికి క్యాచ్ అవుట‌య్యాడు.

*ఫ‌స్ట్ ఓవ‌ర్ నుంచే బౌండ‌రీల మోత మోగిస్తున్న టీమిండియా రెండో ఓవ‌ర్ లో తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (9) రెండో ఓవ‌ర్ నాలుగో బంతికి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. కాగా, అదే ఓవర్ ఆఖ‌రి బంతికి అప్పుడే క్రీజ్ లోకి వ‌చ్చిర రిష‌బ్ పంత్ డ‌కౌట్ గా పెవిలియ‌న్ చేరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement