Friday, November 22, 2024

T20WC Final | చెలరేగిన కోహ్లీ.. సఫారీల టార్గెట్ ఎంతంటే

టీ20 ప్ర‌పంచ క‌ప్ టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సౌతాఫ్రికా ముందు గట్టి టార్గెట్‌నే సెట్ చేసింది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు బాదింది.

ఆదినుంచే దూకుడుగా ఆడిన టీమిండియాకు సౌతాఫ్రికా బౌల‌ర్లు షాకిచ్చారు. ప‌వ‌ర్ ప్లే ముగిసేలోపే కీల‌క‌ ఆటగాళ్లంతా డ‌గౌట్‌కు వెళ్లారు. కేశ‌వ్ మ‌హ‌రాజ్ ఒకే ఓవ‌ర్లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(9), రిష‌భ్ పంత్(0)ల‌ను ఔట్ చేసి బ్రేకిచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే క‌గిసో ర‌బాడ సూర్య‌కుమార్ యాద‌వ్(3)ను వెన‌క్కి పంపాడు.

ఈ క్ర‌మంలో క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్ పటేట్… కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌ను 72 పరుగుల జోడించారు. సిక్సులతో చెలరేగుతన్న అక్షర (47) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక ఆ తరువాత కోహ్లీ జోరందుకున్నాడు.

16వ ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకన్న కోహ్లీ (76) 19వ ఓవ‌ర్ మార్కో జాన్సెన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆఖరి ఓవర్లో అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్‌లో శివం దేబే (27), రవీంద్ర జడేజా (2) పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా (5నాటౌట్). దీంతో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు బాదింది టీమిండియా. ఇక 177 పరుగుల టార్గెట్‌తో సౌతాఫ్రికా చేజింగ్‌ ప్రారంభించిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement