Tuesday, July 2, 2024

T20I | టీ20కి విరాట్ గుడ్ బై.. కప్ గెలవడంపై ఫుల్ హ్యాపీ

టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బార్బడోస్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. అయితే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించడంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి (76) తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. టీ20 ఇంటర్నేషనల్స్ కు గుడ్ బై చెబుతూ… రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… ‘‘భారత్‌కు ఇదే నా చివరి టీ20 గేమ్.. తర్వాతి తరం టీ20 గేమ్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది’’. అంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు.

టీ20ల్లో విరాట్ కోహ్లీ రికార్డు..

మ్యాచ్‌లు – 125

పరుగులు – 4188

- Advertisement -

అత్యధిక స్కోరు 122* (ఆఫ్ఘనిస్థాన్‌పై)

స్ట్రైక్-రేట్ – 137.04

సెంచరీ – 1

హాఫ్ సెంచరీలు – 39

Advertisement

తాజా వార్తలు

Advertisement