Wednesday, November 20, 2024

T20 World Cup | సూప‌ర్ 8 సిడీంగ్ ఇదే..

టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 రేసు ఓ ముగింపుకు వచ్చింది. గ్రూప్-ఏ నుంచి భారత్, అమెరికాలు తుదిపరి దశకు అర్హత సాధించాయి. ఇక గ్రూప్-బీలో అస్ట్రేలియా క్వాలిఫై అయ్యింది. మిగిలిన బెర్త్ కోసం ఇంగ్లండ్, స్కాట్లాండ్ పోటీపడుతున్నాయి. ఒమన్‌పై సంచలన విజయంతో ఇంగ్లండ్ పోటీలో ముందడగు వేసింది. గ్రూప్-సీ నుంచి అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ అధికారికంగా అర్హత సాధించింది. మిగిలిన గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ లు తదుపరి దశకు లో అడుగుపెట్టాయి..

సీడింగ్ అంటే ఏంటి?

దీంతో సూపర్-8లో బరిలోకి దిగే ఎనిమిది జట్లు దాదాపు ఖరారయ్యాయి. వీటిని రెండు గ్రూప్‌లు విభజించనున్నారు. అయితే లీగ్ స్టేజ్‌లో గ్రూప్‌లో నిలిచిన టాప్ ర్యాంకుల ఆధారంగా జట్లను ఐసీసీ వేరు చేయట్లేదు. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఐసీసీ సీడింగ్ చేసింది. అంటే సూపర్-8లో ఏ గ్రూప్‌లో ఏఏ దేశాలు ఉండాలో ముందుగానే నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భారత్‌ బలమైన ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తుంది.

గ్రూప్ స్టేజ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఐసీసీ ముందుగానే ఫేవరేట్ టీమ్స్‌తో సూపర్-8ను రెండు గ్రూప్‌లుగా విభజించింది. వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగాలని తదుపరి దశకు చేరుకునే జట్లను ముందుగానే అంచనా వేసి షెడ్యూల్ చేసింది. గ్రూప్-1లో భారత్ (A1), ఆస్ట్రేలియా (B2), న్యూజిలాండ్ (C1), శ్రీలంక (D2)ను ఉంచింది. అలాగే గ్రూప్-2లో పాకిస్థాన్ (A2), ఇంగ్లండ్ (B1), వెస్టిండీస్ (C2), సౌతాఫ్రికా (D1)ను ఎంపిక చేసింది.

కానీ అనూహ్యంగా గ్రూప్-1లో C1గా భావించిన న్యూజిలాండ్, D2గా అనుకున్న శ్రీలంక లీగ్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే వాళ్ల స్థానంలో అర్హత సాధించిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ తో భారత్ సూపర్-8లో పోటీపడాల్సి వస్తుంది. లీగ్ స్టేజ్‌లో గ్రూప్ టేబుల్‌లో ఫలితాల ఆధారంగా సూపర్ పోరులు నిర్వహిస్తే ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సిన పరిస్థితి రాకపోయేది. కానీ సీడింగ్ ద్వారా ఇప్పుడు ఆసీస్‌తో భారత్ ఢీకొనాల్సి ఉంది. ఇక జోరు మీదున్న అఫ్గానిస్థాన్‌తో సూపర్-8లో టీమిండియా పోటీపడాల్సి ఉంది.

- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌ సూపర్-8లో భారత్ షెడ్యూల్..

జూన్ 20: భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్- బార్బడోస్ (రాత్రి 8 గంటలకు)
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- ఆంటిగ్వా (రాత్రి 8 గంటలకు)
జూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- లూసియా (రాత్రి 8 గంటలకు)

Advertisement

తాజా వార్తలు

Advertisement