Monday, July 1, 2024

T20 World Cup – టీమ్ ఇండియా రెడీ …రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో ఢీ


నేటి రాత్రి గ‌య‌నాలో మ్యాచ్
అల్ రౌండ‌ర్స్ తో ఇంగ్లీష్ టీమ్ జోరు
స‌మీష్టిగా రాణింపే భార‌త్ బ‌లం
హోరాహోరి పోరుత‌ప్ప‌దంటున్న అభిమానులు
వ‌రుణ ద‌య‌త‌లిస్తేనే మ్యాచ్…
వాన‌ప‌డితే నేరుగా ఇండియా ఫైన‌ల్స్ కు

గయానా: టీ20 వరల్డ్‌కప్‌-2024లో గ్రూప్‌ స్టేజ్‌, సూపర్‌-8 దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు టోర్నీ కీలకమైన తుది అంకానికి చేరుకుంది. నేటి నుంచి నాకౌట్‌ సమరం మొదలు కానుంది. సూపర్‌-8లో అద్భుత ప్రదర్శనలు చేసిన భారత్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, అఎn్గానిస్తాన్‌ జట్లు సెమీస్‌లో ప్రవేశించారు. టరౌబా వేదికగా ఈ రోజు జరిగే తొలి సెమీస్‌లో అఎn్గానిస్తాన్‌, దక్షిణాఫ్రికాలు ఢీ కొననున్నా యి. గయానా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో సమవుజ్జీలు భారత్‌- ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకొనున్నాయి. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు టీమిండియా ఆతృతగా ఎదురుచూస్తోంది. 2007 లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి రెండో ట్రోఫీ కోసం భారత అటగా ళ్లు ఎన్నో సార్లు ప్రయ త్నించినా ఫలితం దక్కలె దు. ఈసారి పేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌ ఈ తొమ్మిదో సీజన్‌లో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసా గిస్తూ వరల్డ్‌కప్‌ ట్రోఫీకి కేవలం రెండు అడు గుల దూరంలో నిలిచింది. నేటి సెమీస్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఓడిస్తే టీమిండి యాకు దాదాపు ట్రోఫీ వచ్చినట్లే. ప్రస్తుతం మన ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌లో ఉండటం టీమిండి యాకు కలిసొచ్చే అంశం. ఇక రెండేళ్ల క్రితం ఆస్ట్రేలి యా వేదికగా జరిగిన వరల్డ్‌ కప్‌ లో ఇంగ్లండ్‌ జట్టు సెమీస్‌లో టీమింయాను ఓడిం చింది. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఇకపటిష్టమైన ఇంగ్లం డ్‌ను ఎలాంటి పరిస్థితిలోనూ తక్కువ అంచ నా వేయడానికి వీల్లేదు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లిష్‌ జట్టు మెరుగైన ప్రదర్శనలతో నాకౌట్‌కు దూసుకొ చ్చింది. కీలక సమయాల్లో, జట్టు కు అవసరమైన ప్రతిసారి ఇంగ్లండ్‌ ప్లేయర్లు విధ్వం సకర ప్రదర్శన లతో సత్తా చాటుకున్నారు. బట్లర్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ వరు సగా రెండో వరల్డ్‌కప్‌ ట్రోఫీని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల బలబలాలు సమానం గా ఉండ టంతో ఈ మ్యాచ్‌ హోరాహోరీగా జరగడం ఖా యం. ఇరుజట్ల మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

జ‌డేజాపై వేటు త‌ప్ప‌దా…

ప్రపంచకప్‌లో వరుసగా విఫలమ వుతున్న ఆల్‌రౌం డర్‌ రవీంద్ర జడే జాపై వేటు పడటం ఖాయమ నిపిస్తోంది. అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌ రెండు విభాగాల్లో జడేజా మెరుగైన ప్రదర్శనలు కనబర్చలేక పోతున్నాడు. ఆరు మ్యాచుల్లో కేవలం ఒక్క వికెటే తీశాడు. బ్యాటింగ్‌లోనూ ఇప్పటివరకు 15 పరుగు లు మాత్రేమే చేశాడు. అందుకే కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌లో అతని తొలగించి సంజూ శాంసన్‌కు తుది జట్టులో అవకాఖశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌ మెంట్‌ భావిస్తోందని తెలిసింది. మరోవైపు టీమిం డియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. అయితే ఈసారైన అతడు పుం జుకొని భారీ స్కోరుతో జట్టుకు అండగా నిలవాలని అందరు కోరుకుంటు న్నారు. ఇక గత మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్‌ ఆడిన భారత సారథి రోహిత్‌ శర్మ మరోసారి బ్యాట్‌ ఝూళిపిస్తే ఇంగ్లండ్‌ బౌలర్లకు కష్టాలు తప్పవు. టీమిండియా భారీ స్కోరు సాధిం చడం ఖాయం. మరోవైపు సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే లు కూడా ఫామ్‌లోకి రావ డం కలిసొచ్చే అం శం. ముఖ్యంగా సూర్య, పంత్‌, హార్దిక్‌లు మిడిల్‌ ఆర్డ ర్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్లకు బాటలు వేస్తున్నారు.

బూమ్రా మీద భారీ అంచ‌నాలు

ఈ మెగా టోర్నీలో టీమిండియా విజయా ల్లో బౌలర్లే కీలక పాత్ర పోషించారు. తక్కువ స్కోర్ల మ్యాచుల్లొ నూ వీరు అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కీలక సమయాల్లో పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వరుసగా వికెట్లు తీస్తూ భారత్‌ విజయాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడు కఠినమైన ఇంగ్లండ్‌ సవాల్‌ కోసం కూడా వీరు సిద్ధ మ య్యా రు. పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌ దూకుడైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపెడుతు న్నారు. అర్ష్‌ దీప్‌ ఇప్పటీ వరకు 15 వికె ట్లు పడగొ ట్టగా.. బుమ్రా కూడా 11 వికెట్లతో టోర్నీ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ బౌల ర్‌గా కొనసాగుతున్నాడు.

ఒక్క‌డు ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేస్తే…

డిఫెండింగ్‌ చాంపి యన్‌ ఇంగ్లండ్‌ లో జట్టు నిండా స్టార్లే ఉన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగా ల్లో ఇంగ్లండ్‌ చాలా పటిష్టంగా ఉంది. భారత్‌ సవాల్‌ను ఎదుర్కొనేం దుకు పూర్తిగా సిద్ధమైంది. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, ఫిల్‌ సాల్ట్‌, జానీ బెయిర్‌ స్టో, హ్యారీ బ్రూక్‌లతో కూడిన పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఇంగ్లండ్‌కు సొంతం. మోయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌, సామ్‌ కర్రాన్‌ వంటి మేటి ఆల్‌రౌండర్లతో పాటు ఆదిల్‌ రషీద్‌, టాప్లే, జోర్డన్‌లతో కూడిన బలమైన బౌలింగ్‌ లైనప్‌తో ఇంగ్లండ్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.

వ‌రుణి ద‌య‌పైనే మ్యాచ్ ..
గయానా వేదికగా ఈరోజు భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య సెమీఫైనల్స్‌ జరుగనుంది. భారత్‌ కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. గయానాలో రెండు రోజులుగా భారీ వర్షం కరుస్తోంది. గురువారం మ్యాచ్‌ సమయంలో దాదాపు 80 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అయితే ఈ రెండో సెమీస్‌కు రిజర్వ్‌ డే లేదు. కానీ ఈ మ్యాచ్‌కు ఏకంగా 250 నిమిషాల అదనపు సమయం కెటాయించారు. ఒకవేళ ఈ సమయంలో కూడా మ్యాచ్‌ పూర్తవకపోతే.. మ్యాచ్‌ పూర్తిగా రద్దయింతే. సూపర్‌-8లో టాప్‌లో నిలిచిన భారత్‌ మెరుగైన రన్‌రేట్‌తో నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తోంది.

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకు మార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా/సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దిdప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రా.

ఇంగ్లండ్‌: ఫిల్‌ సాల్ట్‌, జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), జానీ బెయిర్‌ స్టో, హ్యారీ బ్రూక్‌, మొయిన్‌ అలీ, లియమ్‌ లివింగ్‌స్టోన్‌, సామ్‌ కర్రన్‌, క్రిస్‌ జోర్డన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, రీస్‌ టాప్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement