వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. తాజాగా సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ రషీద్ సల్మాని… కోహ్లీకి హెయిర్ కట్ చేసి కొత్త లుక్ ఇచ్చాడు. ఈ ఫోటోలను అతను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘న్యూ లుక్ ఫర్ కింగ్ కోహ్లీ’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోహ్లీ కొత్త లుక్ బాగుందని కామెంట్లు వస్తున్నాయి. రెండేళ్లుగా పేలవ ఫామ్ లో ఉన్న కోహ్లీ ఇటీవల ఆసియా కప్ లో సత్తా చాటి తిరిగి గాడిలో పడ్డాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ పై సెంచరీ చేసి తన పరుగుల దాహం తీరలేదని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో మొదలయ్యే టీ 20 వరల్డ్ కప్ లో అతను భారత జట్టుకు కీలకం కానున్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement