ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ మహిళల జట్టు కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన దక్షిణాఫ్రికా – న్యూజిలాండ్ జట్లు ఈరోజు జరిగిన ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఈ సమవుజ్జీల పోరులో కివీస్ విజేతగా నిలిచి పొట్టి కప్ చేజిక్కించుకుంది. టైటిల్ కోసం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది మహిళల టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 158/5 పరుగులు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్(32), ఆల్‌రౌండర్ అమేలియా కేర్ (43), బ్రూకే హల్లిడే(38)లు దంచి కొట్టారు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ చకచకా డబుల్స్, బౌండరీలు సాధించింది.
159 పరుగుల భారీ చేధనలో అమేలియా కేర్(24/3) విజృంభణతో సఫారీ జట్టు ఒత్తిడిలో పడిపోయింది. కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (33) మినహా ఏ ఒక్కరూ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. కివీస్ బౌలర్లు ధాటికి సఫారీల జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులకే పరిమితమైందది. దాంతో తొలి సీజన్ నుంచి ఊరిస్తున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌ను న్యూజిలాండ్ కొల్లగొట్టింది.