టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ పై విజయం సాధించిన న్యూజిలాండ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అయితే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో గెలుపంచుల వరకు వచ్చిన వెస్టిండిస్ జట్టు ఓటమి తప్పలేదు… చివరి బంతి వరకు పోరాడిన మాజీ చాంపియన్ 8 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 128/9 స్కోరు చేసింది. ఓపెనర్లు సుజీ బేట్స్ (26), జార్జియా ప్లిమ్మర్ (33) చెలరేగారు. మిడిలార్డర్‌లో ఇసాబెల్లా గేజ్ (20) పరువాలేదనిపించింది. ఇక విండీస్ బౌలర్లలో డియాండ్రా డాటిన్ (4/22) చెలరేగిపోయింది. అఫీ ఫ్లెచర్ రెండు వికెట్లు, కరిష్మా రాంహరక్, అలియా అలెన్ చెరో వికెట్ తీశారు.
అనంతరం ఛేజింగ్ ప్రారంభించి వెస్టిండీస్ చివరి బంతి వరకు పోరాడింది. డియాండ్రా డాటిన్ (33) టాప్ స్కోరర్ గా నిలిచింది. అయితే న్యూజిలాండ్ జట్టు తమ బలమైన బౌలింగ్ అండ్ ఫీల్డింగ్‌తో వెస్టిండీస్‌ను అదుపుచేయగలిగింది. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 120/8 పరుగులకు పరిమితమైంది. కాగా, ఆదివారం జరిగే ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ జట్లు మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్ కోసం పోరును అమీతుమీ తేల్చుకోనున్నాయి.