Sunday, September 8, 2024

IND vs SL | టీ20 సిరీస్ ప్రారంభం.. టాస్ గెలిచిన శ్రీలంక..

భారత్ మరో సమరానికి సిద్ధమైంది. శ్రీలంక పర్యటనలో భాగంగా నేటి (శనివారం) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా, పల్లెకెలె వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకుని… టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

కాగా, భారత జట్టు కోచ్‌గా గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు అందుకున్న తర్వాత టీమ్ ఇండియా ఆడనున్న తొలి సిరీస్ ఇదే. మరోవైపు, శ్రీలంక కోచ్‌గా సనత్ జయసూర్య బాధ్యతలు చేపట్టగా, కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో హసరంగ జట్టు పగ్గాలు చేపట్టాడు. దీంతో ఈ సిరీస్‌పై అంచనాలు పెరిగాయి.

జట్ల వివరాలు :

ఇండియా : శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (సి), రిషబ్ పంత్ (వికెట్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్), కుసల్ పెరీరా, చరిత్ అసలంక (సి), వనిందు హసరంగా, కమిందు మెండిస్, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక.

Advertisement

తాజా వార్తలు

Advertisement