రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో టీ-స్క్వేర్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌ను తలపించేలా.. “టీ- స్క్వేర్” నిర్మించి హైదరాబాద్ సిగలో మరో ఐకానిక్ ల్యాండ్ మార్క్‌ను చేర్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేస్తోంది.
రాష్ట్ర పరిశ్రమ మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో టీ-స్క్వేర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు టీ-స్క్వేర్ నిర్మించేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) టెండర్లను ఆహ్వానించింది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా టీ-స్క్వేర్‌ను నిర్మించనున్నారు.
అలాగే, స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా నిర్మాణం ఉండాలని నిర్ణయించారు. రోజూవారీ పనులతో తీరిక లేకుండా గడిపే వారికి టీ-స్క్వేర్‌లో జరిగే ఈవెంట్లతో ఆహ్లాద వాతావరణం కల్పించాలని భావిస్తున్నారు. ఇక్కడ టీజీఐఐసీ భారీ ప్లాజాను నిర్మించనుంది. ఈ మేరకు అర్హులైన కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు టీజీఐఐసీ కసరత్తు చేస్తోంది.