హైదరాబాద్, ఆంధ్రప్రభ : స్టార్టప్ ఇండియా మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నేషనల్ స్టార్టప్ అవార్డులు – 2022లో టీ హబ్ విజేతగా నిలిచింది. స్టార్టప్‌ల ఉత్తమ ఇంక్యుబేటర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని టీ హబ్ సోమవారం ఒక ప్రకనటనలో తెలిపింది. భవిష్యత్తులో ఆవిష్కరణలకు ఊతమిస్తూ వ్యాపారవేత్తలను తయారు చేయడంలో తమ కృషి కొనసాగుతుందని టీ హబ్ సీఈవో ఎమ్. శ్రీనివాస్ తెలిపారు.
అంకుర కంపెనీలకు ఊతమివ్వడానికిగాను 2015లో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. గతేడాదే టీ హబ్ రెండవ దశను కూడా ప్రారంభించి మొత్తం ఇంక్యుబేటర్‌కు కళ్లు చెదిరే కొత్త భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది.