Wednesday, November 20, 2024

సిరియా ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోన్న ఫొటో..

అంద‌రిది ఒక దారి అయితే సిరియాది మ‌రోదారి..నిత్యం యుద్ధాలు..బాంబుల మోత‌తో అక్క‌డి ప్ర‌జ‌ల ఇక్క‌ట్ల గురించి చెప్ప‌డానికి మాట‌లు చాల‌వు. ప్ర‌స్తుతం సిరియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న ప్రశ్నకు ఒకే ఒక్క ఫోటోతో సమాధానం చెప్పారు. ఈ ఫోటోను చూసినంతనే చిన్న చిన్న కష్టాలకు బెదిరిపోతూ.. తమ కంటే దురదృష్ట‌వంతులు మరెవరూ లేరని ఫీలయ్యే వారందరికి..నిజంగా మనం ఎంత లక్కీ అనే విషయాన్ని ఈ ఫోటో చెప్పేస్తోంది.

సిరియా ప్ర‌జ‌ల బాధ‌ల‌ను త‌ల‌చుకుంటే ఎవ‌రికైనా కంట క‌న్నీరు రావాల్సిందే. కాగా సిరియాలో జరిగిన ఒక బాంబుదాడిలో మున్జీర్ అనే వ్య‌క్తి తన కాలును కోల్పోయాడు. దీంతో.. అతడు ఊత కర్ర ఆసరాగా చేసుకొని బతుకుతున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. యుద్ధంలో వెలువడిన నెర్వ్ గ్యాస్ ను పీల్చటం కారణంగా అతని భార్య‌.. కాళ్లు.. చేతులు లేని శిశువుకి జ‌న్మ‌నిచ్చింది. ఆ పిల్ల‌వాడి పేరు ముస్తఫా. సిరియా యుద్ధం తీసుకెళ్లి పోయిన సంతోషాన్ని.. తిరిగి సొంతం చేసుకోవటానికి వారు ఆ దేశాన్ని వదిలి దక్షిణ టర్కీ కు వెళ్లిపోయి.. అక్కడే సెటిల్ అయ్యారు.

సిరియాని వ‌దిలిన త‌ర్వాత వారు ఒక సంతోష సమయంలో ఆ తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఇట్టే అర్థమయ్యేలా ఫోటో తీశారు టర్కిష్ ఫోటో గ్రాఫర్ మెహ్మత్ అస్లస్. ఈ ఫోటో సియెనా ఇంటర్నేషనల్ ఫోటో అవార్డ్స్ 2021 కు ఫోటో ఆఫ్ ద ఇయర్ గా పురస్కారానికి ఎంపికైంది. వేల మాట‌లు చెప్ప‌లేనిది ఒక ఫొటోలో చూపించాడు ఈ ఫొటోగ్రాఫ‌ర్ అని కొనియాడుతున్నారంతా.

Advertisement

తాజా వార్తలు

Advertisement