నిజామాబాద్ (ప్రభ న్యూస్) : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలు జానపదాలని ప్రముఖ కవి, దాశరథి పురస్కార గ్రహీత డా.అయాచితం నటేశ్వర శర్మ అన్నారు. శ్రీపాద సాహితీ కళాపీఠం, స్వర సౌరభం సంయుక్త ఆధ్వర్యంలో అదివా రం స్ధానిక రెల్వే స్టేషన్ రోడ్డు గీత భవనంలో దాశరథి సినారె సంగీత విభావరి కార్య క్రమం జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయాచితం నటేశ్వర స్వామి మాట్లాడుతూ “నా తెలంగాణ కోటి రతనాల వీణష తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం ఇందూరు ఖిల్లా జైలు నుంచి ఆరంభమైనదని అన్నారు. సినారె తెలుగు పాటలపూతోటానికొనియాడారు.
కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీపాద కుమార శర్మ మాట్లాడుతూ తెలంగాణకు సాహిత్య సాంస్కృతిక స్వరాభిషేకం చేసిన దాశరథి సినారె రెండు కళ్లు అని కొనియాడారు. ఈ సందర్బంగా సభ సామ్రాట్ వి పి చందన్ రావుకు జీవన సాఫల్య పురస్కారం అందజేసి శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అనిల్ కుమార్, అయాచితం నాగరాజ శర్మ, జనగామచంద్రశేఖరశర్మ, డా.త్రివేణి,డా.శారద హనుమండ్లు, డా.గణపతి అశోక శర్మ దారం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సంగీత విభావరి అహుతులను ఆకట్టుకుంది. దాశరథి రచించిన పలు చిత్రాలలోని పాటలను వేముల శేఖర్, విజయ లక్ష్మీ, సముద్రాల రాంలు, అలపించారు.