హైదరాబాద్,(ప్రభ న్యూస్): ఓ వైపున వర్షాలు… మరోవైపు రోజు రోజుకు పెరుగుతున్న చలి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కు ధరించడం, చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవడం ద్వారా ఇటు కరోనాతోపాటు అటు స్వైన్‌ఫ్లూ, ఇతర రకాల ఇన్‌ఫ్లూయింజా వైరస్‌ల నుంచి రక్షణ లబిస్తుందంటున్నారు. అయితే ప్రస్తుత కరోనా కాలంలో దగ్గు, జలబు, జ్వరం, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతు ఉండడంతో, చాలా మంది కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్, ఇతర ఫ్లూ వైరస్ లక్షణాలు ఒకేవిధంగా ఉండడంతో ప్రజలు కరోనాగా భావిస్తున్నారు.
అయితే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఫ్లూ వైరస్ నుంచి రక్షణ పొందలేమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మామూలుగానే శీతాకాలంలో ఫ్లూ వైరస్‌ల దాడి ఎక్కువగా ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రతలు పడిపోతుండడం ఇన్‌ఫ్లూయింజా ఫ్లూ వైరస్‌ల విస్తృతికి కారణమవుతోంది. దాంతోపాటు శ్వాసకోశ వ్యాధులు తిరగబెడతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. స్వాబ్‌తో ఆర్టీపీసీఆర్ టెస్టుల ద్వారా కేవలం కొవిడ్, స్వైన్‌ఫ్లూ నిర్ధారణ మాత్రమే జరుగుతోందని, ఇతర రకాల ఫ్లూ వైరస్‌లను నిర్ధారించేందుకు మరిన్ని కొత్త టెస్టింగ్ పద్దతుల రావాల్సిన అవసరం ఉంటుందంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily