Tuesday, November 26, 2024

Swimming | వ్రితి అగర్వాల్‌ అదుర్స్‌.. వరుసగా నాలుగో పతకం సాధించిన తెలంగాణ యువ స్విమ్మర్‌

గోవా: గోవా వేదికగా జరుగుతున్న 37వ నేషనల్‌ గేమ్స్‌లో తెలంగాణ యువ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ పతకాల మోత మోగిస్తోంది. గురువారం ఇక్కడి ఇండోర్‌ స్టేడియం స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన 1500 మీటర్ల మహిళల ఫ్రీ స్టయిల్‌ ఈవెంట్‌లో వ్రితి రజత పతకం గెలుచుకుంది. ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రతీభ కనబరుస్తున్న అగర్వాల్‌ తన ఖాతాలో నాలుగో పతకాన్ని వేసుకుంది.

ఈ పోటీలో ఢిల్లికి చెందిన భవ్య సచ్‌ దేవా (17;40.80 సెకన్లు) తొలి స్థానంతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా.. తెలంగాణ యువ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ (18;03.88 సెకన్లు) సిల్వర్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది. మూడో స్థానంలో నిలిచిన కర్ణాటక స్విమ్మర్‌ శిరీన్‌ (18;18.21 సెకన్లు) కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

- Advertisement -

క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక..

జాతీయ క్రీడల్లో భాగంగా జరుగుతున్న బ్యాడ్మింటన్‌ పోటీల్లో తెలంగాణ షట్లర్‌ రష్మిక భామిబియోటీ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ ఫైనల్‌లో రష్మిక (తెలంగాణ) 6-0, 6-1 తేడాతో ఆంధ్రకు చెందిన హర్షిణి వివానాథ్‌ను వరుస గేముల్లో చిత్తు చేసింది. ఆది నుంచే దూకుడుగా ఆడిన రష్మిక ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి గేమ్‌ను ఏకపక్షంగా గెలుచుకున్న ఈమె రెండో గేమ్‌లోనూ అదే జోరు కనబర్చి ప్రత్యర్థిని భారీ తేడాతో చిత్తు చేసి క్వార్టర్‌ ఫైనల్ల్లో దూసుకెళ్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement