Friday, November 22, 2024

స్విగ్గీ, స్టెప్‌ ఎ హెడ్‌.. డెలివరీ బాయ్స్ కు ఛాన్స్‌..

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా స్విగ్గీ తన డెలివరీ బాయ్స్‌ పూర్తి స్థాయి ఉద్యోగులుగా మారే అవకాశం కల్పిస్తోంది. నిర్వహణ సంబంధిత స్థాయిలో ఉద్యోగ అవకాశాలను ఇవ్వడంతో పాటు స్థిరమైన ఆదాయం, అదనపు ప్రయోజనాలను అందిస్తామని తెలిపింది. ప్రస్తుతం స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌గా పని చేస్తున్న వారు స్టెప్‌ ఎ హెడ్‌ కార్యక్రమం కింద ఈ ఉద్యోగాలలో చేరొచ్చు. డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ తమ సంస్థకు వెన్నెముక అని స్విగ్గీ ఎప్పటికీ నమ్ముతుందని, దేశ వ్యాప్తంగా 2.70లక్షల మందికి ఆదాయ అవకాశాలు కల్పించిందని తెలిపింది. చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ.. పార్ట్‌ టైమ్‌ ఉద్యోగంగా లేదా అదనపు ఆదాయ వనరుగా చాలా మంది పని చేస్తున్నారని తెలిపింది. అలాంటి వారి కోసం తాము మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్టు వివరించింది. స్టెప్‌ ఎ హెడ్‌ పేరుతో సంస్థ నిర్వహణ స్థాయిలో వైట్‌ కాలర్‌ ఉద్యోగులుగా మారే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది.

ఫుల్‌టైమ్‌ ఉద్యోగులుగా..

స్విగ్గీ ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులుగా పని చేయడానికి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లో డిగ్రీ పట్టభద్రులై, చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఫ్లీట్‌ మేనేజర్స్‌గా వివిధ పాత్రలు పోషించాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్స్‌ లాగ్‌ ఇన్‌ అవర్స్‌, డెలివరీ క్యాన్సిలేషన్స్‌, సమస్యల పరిష్కారం, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ కోసం ప్రత్యేక ప్రాజెక్టులపై పని చేయాల్సి ఉంటుంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌ నుంచి 20 శాతం మందిని ఫ్లీట్‌ మేనేజర్లుగా నియమించుకోవాలని స్విగ్గీ యోచిస్తున్నది. ఎక్కువ కాలం స్విగ్గీలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement