ప్రభన్యూస్: సాఫ్ట్ బ్యాంక్ మద్దతున్న స్టార్టప్ స్విగ్గీ తన కంపెనీకి చెందిన గ్రోసరీ డెలివరీ సర్వీస్ ఇన్‌స్టామార్ట్‌లో 700 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.5252 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. అధిక పోటీ ఉండే దేశీయ మార్కెట్‌లో మరింత బలోపేతమవ్వడమే లక్ష్యంగా ఈ పెట్టుబడి పెడుతున్నట్టు కంపెనీ పేర్కొంది. కాగా గతేడాది తొలిసారి బెంగళూరు, గురుగ్రామ్‌లో ప్రారంభించిన ఇన్‌స్టామార్ట్ రానున్న మూడు త్రైమాసికాల్లో 1 బిలియన్ డాలర్ల గ్రాస్ మర్చండైస్ వ్యాల్యూ రన్ రేట్‌ను నమోదు చేస్తుందని స్విగ్గీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇన్‌స్టామార్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18కిపైగా నగరాల్లో 1 మిలియన్‌కుపైగా ఆర్డర్లకు సర్వీసులు అందిస్తోంది. కాగా జనవరి 2022 నాటికి టాప్ సిటీల్లో 15 నిమిషాల్లో డెలివరీ సర్వీసును ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. కాగా కరోనా మహమ్మారి అకస్మాత్తుప్రభావంతో భారత్‌లో హోం డెలివరీ కంపెనీలు అకస్మాత్తుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పరిశుభ్రతపట్ల అవగాహన పెరగడంతో బయటి ఆహార పదార్థాలపై కస్టమర్లు అనాసక్తి చూపారు. అయితే క్రమక్రమంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. మళ్లిd జనాలు ఆన్‌లైన్ ఆర్డరింగ్ వైపు అడుగులు వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital