ఇటీవల బీఎస్పీలో చేరిన ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ను తిట్టి హీరో కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తున్నారని గాదరి కిషోర్ మండిపడ్డారు.
అయితే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై గాదరి కిషోర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో స్వేరోస్‌కు చెందిన ఓ కార్యకర్త తట్టుకోలేకపోయాడు. దీంతో స్వయంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను స్వేరో సంపత్‌గా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి… ప్రవీణ్ కుమార్‌పై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను తిట్టే స్థాయి లేదంటూ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చాడు.
అయితే ఆ వ్యక్తి బెదిరింపులకు లొంగని ఎమ్మెల్యే గాదరి కిషోర్ అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాను బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తిని కాదని… తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినట్లు పేర్కొన్నారు. గాదరి కిషోర్ అంటే మామూలు వ్యక్తి కాదని కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బెదిరించమని ప్రోత్సహిస్తే నువ్వు బెదిరిస్తున్నావా?అంటూ నిలదీశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు. మరోసారి ఇలా బెదిరింపులకు దిగితే… పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే గాదరి కిషోర్ పేర్కొన్నారు.
ఈ వార్త కూడా చదవండి: RS ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్