Thursday, September 19, 2024

Swearing Ceremony ఢిల్లీ సీఎంగా 21న ఆతిశీ ప్రమాణస్వీకారం

ఢిల్లీలో మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా 21న ప్రమాణం చేయనున్నారు. ఈమేరకు పార్టీ గురువారం అధికారికంగా వెల్లడించింది. ఆమెతో పాటు పలువురు నేతలు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపింది.

మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీ పేరును ప్రతిపాదించగా ఆప్‌ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ ఆతిశీ.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కోరారు. ఆయన అంగీకరించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆప్‌ సిద్ధమైంది.

ఢిల్లీకి మూడో ముఖ్య‌మంత్రి..

షీలా దీక్షిత్‌ (కాంగ్రెస్‌), సుష్మా స్వరాజ్‌ (భాజపా) తర్వాత ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ నిలవనున్నారు. ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వంలో ఆమె 14 శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో ఆర్థిక, రెవెన్యూ, విద్య తదితర ముఖ్య శాఖలున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement