Saturday, September 21, 2024

స్వాతిముత్యం చిత్రం – రిలీజ్ పై క్లారిటీ

ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం స్వాతిముత్యం.ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్ హీరోగా న‌టిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. దసరా కానుకగా అంటే అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement