Saturday, January 18, 2025

Swachh Andhra – ప‌రిస‌రాల శుభ్ర‌తే ప్ర‌గ‌తికి తొలి మెట్టు … ప‌వ‌న్ క‌ల్యాణ్

పెద‌కాకాని – పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం అందరి బాధ్యత అని అన్నారు ఎపి డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ .. కరోనా మహమ్మారి వంటి పరిస్థితుల్లో శుభ్రత గురించి ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌న్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేప‌థ్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో ఆయ‌న కల్యాణ్ మొక్కలు నాటారు, అనంతరం పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఆయనతో పాటు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. పంచాయతీల పరిధిలో చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే క్రమం వంటి విషయాలను స్వయంగా పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప‌వ‌న్. ప్రస్తుతం చెత్తను సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త ట్రాక్టరును స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నడిపి, స్వచ్ఛతలో తాను కూడా భాగమనే సందేశాన్ని నింపారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ, ప‌రిస‌రాలు శుభ్ర‌తే ప్ర‌గ‌తికి తొలిమెట్టు అన్నారు.. కొన్ని దేశాలు వ్యర్థాలతో అద్భుతాలు చేస్తున్నాయని గుర్తు చేశారు, ఏపీలో కూడా ‘స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంతో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. 2048 నాటికి రాష్ట్రం అద్భుతమైన పురోగతి కోసం ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని పిలుపు ఇచ్చారు… పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామ‌ని మంటూ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు.

- Advertisement -

ఏ కార్యక్రమం అయినా రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవని అంటూ . రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాల‌ని అన్నారు. మన చిన్నతనం నుండి వ్యర్థాలను ఇంటి పెరటిలో, మొక్కలకు వేసే సంస్కృతి ఉంద‌ని, అయితే ఇప్పుడు అది పూర్తిగా దూరమైంద‌ని చెప్పారు. మరలా ఆ సంస్కృతిని తీసుకురావాల‌ని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న పిలుపు ఇచ్చారు పవన్ కల్యాణ్.

ఈ కార్య‌క్ర‌మంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement