బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై హత్యాయత్నం జరిగింది. ఇనుప రాడ్లు చేత బట్టి బండి సంజయ్ వెళ్తున్న కాన్వాయికి స్వేరోస్ అడ్డం పడ్డారు. కాన్వాయి లోని మొత్తం కార్లలో సంజయ్ కోసం వెతికారు…వెంటనే బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనితో అక్కడ నుంచి బండి సంజయ్ క్షేమంగా బయట పడ్డారు. స్వేరోస్ దాడిలో సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాగ్యరెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయని తెలిపారు.
కాగా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై నిన్న బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.