Wednesday, November 20, 2024

సుజుకి, మారుతీ సుజుకీ, ఐఐటీ హైదరాబాద్‌ సంయుక్త ప్రదర్శన

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : పరిశ్రమలో మొదటి ప్రయత్నంగా, సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌, జపాన్‌ (ఎస్‌ఎంసీ), మారుతీ సుజుకీ ఇండియా లిమి-టె-డ్‌ (ఎంఎస్‌ఐఎల్‌), ఐఐటి హైదరాబాద్‌ (ఐఐటీ-హెచ్‌) ఫ్యూచరిస్టిక్‌ వీ2ఎక్స్‌ (వాహనం నుంచి ప్రతి ఒక దాన్నీ) కమ్యూనికేషన్‌ -టె-క్నాలజీ ఆధారంగా భారతదేశ-నిర్దిష్ట వాహన వినియోగ పరిస్థితులను పరిశోధించేందుకు జతకట్టాయి. ఈ అప్లికేషన్‌లను ప్రదర్శించే మొదటి ప్రోటో-టైప్‌లను ఇక్కడి ఐఐటి హైదరాబాద్‌ క్యాంపస్‌లో ప్రదర్శించారు.

భారత ప్రభుత్వం, -టె-లికాం రెగ్యులేటరీ అథారిటీ- ఆఫ్‌ ఇండియాకు సలహాదారు మునిశేఖర్‌ అవిలేలి, భారత ప్రభుత్వం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ -టె-లికమ్యూనికేషన్స్‌, డిప్యూటీ- డైరెక్టర్‌ జనరల్‌ (స్టాండ్డంజేషన్‌- ఆర్‌అండ్‌ డి – ఇన్నోవేషన్‌), వై.జి.ఎస్‌.సి. కిషోర్‌ బాబు, భారత ప్రభుత్వం, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ -టె-లికమ్యూనికేషన్స్‌, డైరెక్టర్‌ (వైర్‌లెస్‌ మానిటరింగ్‌ ఆర్గనైజేషన్‌) వి.జె.క్రిస్టోఫర్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు అండ్‌ వాణిజ్యం, ఐటి శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ (ఐఏఎస్‌)లకు 5 వాహన వినియోగ సందర్భాలను ప్రదర్శించారు. ఐఐటిహెచ్‌ నుంచి చైర్మన్‌ బి.వి.ఆర్‌.మోహన్‌ రెడ్డి, ఐఐటిహెచ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి ఎస్‌ మూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంకేతిక డిమాన్‌స్ట్రేషన్‌లో జపాన్‌లోని సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కజునోబు హోరీ, మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ అగర్వాల్‌, మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ భారతి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement